
జగన్ విధానాలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మతమార్పిడులను ప్రోత్సహించారని, ఏ రోజూ హిందూ మతాన్ని పట్టించుకోలేదని ఆ పార్టీ బహిష్కృత నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.హిందూ మతాన్ని కించపరిచే చర్యలను తాను అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఐదేళ్లకోసారి కూటమి మారుస్తారని, బీజేపీ, కాంగ్రెస్తో జతకట్టగలరని, అందుకే ఆయన హిందూ మతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.తాను అధికారంలోకి వస్తే సాదిక్ లాంటి వారికి ఉత్తరప్రదేశ్ తరహా ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు.
రాబోయే 3-4 నెలల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని ఆయన ఒక ప్రెస్మీట్లో వెల్లడించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
ఆయన కొత్త పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది.





